Mr Darla Chinna Devaiah

"కవితా భావాలు అనేవి మాటల్లో మాత్రమే కాదు, మనసులో కూడా నిలిచిపోయే మధుర జ్ఞాపకాలు" అని నమ్మే నేను; ప్రేమకు అర్థాన్ని, బాధకు కారణాన్ని, వేదనకు మూలాన్ని, కష్టాలు, కన్నీళ్ళు , పేదరికం ,ఆకలి, అన్యాయం లాంటి భావాలను కవితా రూపంలో అందించాను. కవితా ప్రపంచంలో నాదైన ముద్ర వేయాలనుకుంటూ, ప్రతి కవితకు నిజమైన భావాలతో ప్రాణం పోస్తూ ఒలికించిన కవితలతో "మనసు పలికిన పదాలు "అనే పేరుతో ఈ పుస్తకాన్ని అనేక భావోద్వేగ పూర్వకమైన కవితల సమ్మిళితం చేసి రాశాను. ప్రతి కవిత వెనుక ఒక అనుభూతి, ఒక అపూర్వమైన కథ దాగి ఉంది. నేను ఉపయోగించిన పదాలు బాధలో ఉన్నవారికి తోడుగా నిలుస్తాయి.

కవితలు అనేవి కేవలం ఒక భావం కాదు, అది మనసును తాకే సంగీతం. ఈ పుస్తకం ద్వారా నేను నా హృదయాన్ని మీ వద్దకు చేరువ చేయాలనుకుంటున్నాను. కవితలను అర్థం చేసుకునే ప్రతి హృదయానికి ఇది అంకితం. నా అనుభవాల సారాంశం, నా హృదయపు ప్రతిబింబం ఈ పుస్తకంలో మీరు చూడగలరు.నా రచనలు భావోద్వేగాల సవ్వడి, సమాజం యొక్క లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.కష్టాల గాఢతను అనుభవించిన ప్రతివారికీ ఈ పుస్తకాలు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

దార్ల చిన్న దేవయ్య

లేళ్ళపల్లి గ్రామం

త్రిపురాంతకం మండలం

ప్రకాశం జిల్లా

ఆంధ్రప్రదేశ్

9603940769

Artículos populares por Mr Darla Chinna Devaiah

Ver todas las ofertas